టీడీపీ మహాధర్నా ఉద్రిక్త౦
posted on Aug 25, 2012 @ 12:05PM
కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ వద్ద టీడీపీ చేపట్టి మహాధర్నాఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాకు వస్తున్న రైతులు, నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రహదారిపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గుంటూరు నుంచి ప్రకాశం బ్యారేజీకి వె ళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు కూడా పోలీసులు నగరంలోనికి అనుమతించడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.