రైతులకు కరెంట్ కష్టాలు తీరేవరకు దీక్ష: హరీష్
posted on Aug 22, 2012 @ 11:17AM
తెలంగాణ ప్రాంత రైతులకు కరెంట్ కష్టాలు తీరేంత వరకూ తమ నిరసన దీక్ష కొనసాగుతుందని టీర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, కిరణ్కు మధ్య పెద్ద తేడాలేదని వారు మండిపడ్డారు. బాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్చి చంపారని... ఇప్పుడు కరెంట్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలను కిరణ్ అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వమనటమే నేరమా అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. రైతులకు ఏడు గంటల కరెంట్పై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేని వారు డిమాండ్ చేశారు. అప్పటివరకూ తమ నిరసన దీక్ష కోనసాగుతుందని స్పష్టం చేశారు.