పుట్టిన రోజు పేరుతో ఇంట్లో అసభ్యకర నృత్యాలు
posted on Aug 21, 2012 @ 4:21PM
హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో ఓ ఇంట్లో జరుగుతున్న రెవ్ పార్టీ పైన పోలీసులు దాడి చేసి, ఎనిమిది మంది యువతులు, కొంతమంది యువకులను అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్ సమీపంలోని వెంకటాద్రి టౌన్ షిప్‌లోని ఓ ఇంట్లో రేవ్ పార్టీ పేరుతో అసభ్యకర నృత్యాలు చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి, యువతీ యువకులతో పాటు హుక్కా సామాగ్రిని, మద్యం బాటిళ్ళను పోలీసులు సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.