ఎమ్మెల్యేలు ఉన్నబొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
posted on Aug 22, 2012 @ 12:34PM
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేల అరెస్ట్ నేపథ్యంలో పీఎస్‌కు తరలివచ్చిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు పీఎస్‌లోకి రాడానికి మీడియాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు ఎమ్మెల్యేల అరెస్ట్‌కు నిరసనగా టీఆర్ఎస్, జేఏసీ నేతలు కాసేపట్లో విద్యుత్ సౌధను ముట్టడించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావులను పోలీసులు గృహనిర్భంధం చేయగా, మరో నేత టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు సుమన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.