మహిళను రేప్ చేసిన ఆర్మీ డాక్టర్
posted on Aug 25, 2012 @ 3:18PM
మహారాష్ట్ర లోని నాగపూర్ లో ఆర్మీ డాక్టర్ ఒకతను ఓ వివాహిత మహిళను శనివారం రేప్ చేశాడు. ని౦దితుడిని సారంగ్ రామచంద్ర కనాడేగా పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. ఆమె ఇంట్లోనే శనివారం ఆర్మీ డాక్టర్ ఆ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆర్మీ డాక్టర్ తో మహిళకు ముందుగానే పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే అతను ఆమె ఇంటికి తరుచుగా వస్తుండేవాడు. ఉన్నత వైద్య చదువుల కోసం అతను ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. బాధితురాలు ఓ ప్రైవేట్ మెడికల్ ఆస్పత్రిలో పనిచేస్తోంది.