ధర్మాన రాజీనామా ఆమోదించాలి
posted on Aug 25, 2012 @ 3:55PM
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో ఉందని, మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణమే ఆమోదించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28న విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా హర్తాళ్ చేస్తామని రాఘవులు హెచ్చరించారు.