ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సబ్‌కమిటీ నివేదిక
posted on Aug 25, 2012 @ 3:12PM
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి కేబినేట్ సబ్ కమిటీ నివేదికను అందజేసింది. శనివారం ఉదయం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సబ్ కమిటీ నేతలు సీఎం కిరణ్‌తో భేటీ అయి నివేదికను అందజేశారు. ఉప ప్రణాళికపై కమిటీ వేయాలని నివేదికలో సూచించింది. పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు గడువుకావాలని సబ్ కమిటీ కోరినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ నేతృత్వంలో సబ్‌కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.