బీజేపీకి సోనియా సవాల్
posted on Aug 28, 2012 @ 11:15AM
పార్లమెంట్ లో బొగ్గు స్కాం పై చర్చించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సోనియా సవాల్ చేశారు. బీజేపీ ఎప్పుడు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీకి పార్లమెంటరీ వ్యవస్థపై గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలతో సోనియా గాంధీ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. బొగ్గు కేటాయింపులు వ్యవహారంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలతో సోనియా చర్చించారు.