ద్రవిడ్ కి పద్మభూషణ్
posted on Aug 28, 2012 @ 10:52AM
భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు కోసం ద్రవిడ్ పేరును, పద్మశ్రీ అవార్డు కోసం గౌతమ్ గంభీర్ పేరును కేంద్ర ప్రభుత్వానికి బిసిసిఐ సిఫారసు చేసింది. పద్మ పురస్కారాల నామినేషన్‌లను పంపించేందుకు ఆఖరి తేదీ ఆగస్టు 15 కాగా బిసిసిఐ బోర్డు అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ దీనిపై చర్చించి ప్రభుత్వానికి క్రికెటర్ల పేర్లను పంపారని బిసిసిఐ అధికారి చెప్పారు. ఈ సంవత్సరం మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు చేయగా,344 వన్డేలు ఆడి 10,889 పరుగులు చేశాడు.