ధోనీతో ఎలాంటి గొడవలు లేవు
posted on Aug 28, 2012 @ 10:32AM
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు ఎలాంటి విబేధాలు లేవని వివియస్ లక్ష్మణ్ చెప్పారు. తనకు, ధోనీకి మధ్య మీడియాలో వచ్చినట్లు ఏ విధమైన వివాదం లేదని ఆయన అన్నారు. భారత్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ చూసేందుకు శనివారం ఉప్పల్ వెళ్ళాలని అనుకున్నానని, వర్షం పడటంతో కుదరలేదని చెప్పారు. తన పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆదివారం కూడా వెళ్లలేకపోయానని అన్నారు.ఇంటిలో కూర్చుని టీవీలో మొత్తం మ్యాచ్ చూశానని,భారత్ మ్యాచ్‌ను గెలవడం ఆనందంగా ఉందని చెప్పారు.