గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు
posted on Aug 6, 2012 @ 2:29PM
ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి.
* కృష్ణా జిల్లాలోని కంచికర్ల -మోగులూరు దగ్గర సుద్దవగు పొంగిపొర్లుతుండటంతో అక్కడి పంటపొలాలు నీటమునిగాయి.
* రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర వరద ఉదృతి అధికంగా ఉండటంతో అధికారులు 4లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
* సాంకేతిక లోపం కారణంగా శ్రీకాకుళం జిల్లా సముద్రతీరంలో గల్లంతైన తండంగి మండలం హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకి కళింగపట్నం సమీపంలో లభ్యమైంది. వారిని వేరే బోటు సహాయంతో ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
* ప.గో జిల్లాలో భారీ వర్షాల కారణంగా 400 హెక్టార్లలో వరినాళ్లు 1600 హెక్టార్లలో నారుమళ్లు నీటమునిగాయి. జీలుగుమిల్లి మండలంలో జిల్లేరు, బైనేరు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.