వీడుతున్న నీలిమ మృతి మిస్టరీ
posted on Aug 6, 2012 @ 2:36PM
ఇన్ఫోసిస్ కార్యాలయంపై నుంచి దూకి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ మృతి మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతికి ముందు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి ప్రశాంత్, సంస్థలోని ఇతర స్నేహితులకు పంపిన ఈ మెయిళ్లను పోలీసులు తెరిచి చూశారు. ఈ మెయిల్స్‌ను, మెసేజ్‌లను, ఫోన్ కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు. వీటి ఆధారంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో మృతి చెంది ఉంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటి ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. నీలిమది ఆత్మహత్యే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నీలిమ నుంచి చివరి కాల్ అందుకున్న వ్యక్తి ప్రశాంత్ విశాఖపట్నంలో ఉన్నట్లుగా ఇప్పటికే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించారు. ఆమె భర్త సురేష్‌ని విచారించారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు.