గ్యాస్ కోటాలో కోతపై చంద్రబాబు ఆగ్రహం
posted on Aug 6, 2012 @ 12:29PM
మన రాష్ట్రానికి రావలసిన గ్యాస్ కోటాలో కొత విదించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు కేటాయించిన గ్యాస్ కోటను తిరిగి మళ్ళించాలని చంద్రబాబు అన్నారు. మన సహజ వనరులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటే కాంగ్రెస్ నేతలు తమకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. జైపాల్ రెడ్డి మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపడలేకపోయారన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రప్రభుత్వ దుర్మార్గ చర్యలను ఎండగట్టాలని పిలుపు ఇచ్చారు.