గాంధీభవన్‌లో వీహెచ్ మౌనదీక్ష
posted on Jul 28, 2012 @ 12:22PM
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శనివారం ఉదయం గాంధీభవన్‌లో మౌనదీక్ష ప్రారంభించారు. పార్టీలో మేథోమథనం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా వీహెచ్ దీక్ష కాంగ్రెస్‌లో దుమారం రేపింది. ఆయన దీక్షకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మల్లాదివిష్ణు, జోగిరమేష్ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి ఆజాద్‌కు లేఖ రాశారు. వీహెచ్ దీక్ష పార్టీకి నష్టం కల్గిస్తుందని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలో దీక్ష వల్లే వీహెచ్ పార్టీకి నష్టం కలిగించారి వారు లేఖలో తెలిపారు