ఉప్పల్ టెస్ట్: 159 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
posted on Aug 25, 2012 @ 1:57PM
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో టీంఇండియా పట్టు బిగించింది. 105 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజైన శనివారం బరిలోకి దిగిన కివీస్ 159 పరుగులకు ఆలౌట్ అవడంతో ఫాలో ఆన్‌లో పడిపోయింది. దీంతో భారత్ 279 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ : 438. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు 6 వికెట్లు, ఓజాకు 3, ఉమేష్‌కు 1 వికెట్ తీశారు. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూడిలాండ్ సాయంత్రం ఆట ముగిసే సమయానికి 42 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. శనివారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 54 పరుగులు చేసి 159 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్‌లో న్యూజిలాండ్ జట్టు ఆడనుంది.