ఉప్పల్ టెస్ట్: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
posted on Aug 26, 2012 @ 5:04PM
హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై టీమిండియా ఒక ఇన్నింగ్స్115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకు ఆలౌటయింది. మెక్ కల్లమ్(52), విలియమ్సన్(42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరు వికెట్లు నేల కూల్చాడు. ఓజా మూడు వికెట్లు పడగొట్టాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు, కివీస్ 159 పరుగులు చేసింది. ఈ విజయంతో రెండు టెస్ట్ ల సిరీస్ లో ధోనీ సేన 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్ట్ బెంగళూరులో ఈనెల 31న ప్రారంభమవుతుంది.