సోనియా, మన్మోహన్ నివాసాల దగ్గర ఉద్రిక్తత
posted on Aug 26, 2012 @ 4:47PM
బొగ్గు కుంభకోణాన్ని నిరసిస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యుడు అరబింద కేజ్రీవాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని, నిరసన కారులను చెల్లాచెదురు చేశారు. లాఠీచార్జీ జరిపి కేజ్రీవాల్‌తో సహ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన కేజ్రీవాల్‌ను పోలీసులు రెండోసారి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ బృందం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగింది. మరోవైపు భారీ ఎత్తున మహిళా ఆందోళనకారులు సోనియా నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సోనియా, మన్మోహన్ నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.