భారత్ పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ వద్దు
posted on Aug 27, 2012 @ 11:04AM
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని ఇరు దేశాల క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. కానీ పాకిస్తాన్‌లోని హిందువులు మా త్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇండో-పాక్ సిరీస్‌లో భార త్ విజయం సాధించిన ప్రతిసారీ తమపై వేధింపులు మామూలైపోయాయని పాక్ హిందువులు అంటున్నా రు. 'భారత్-పాక్ మధ్య సిరీస్ జరిగితే మేం ఇబ్బందుల్లో పడతాం. భారత్ గెలిస్తే.. ఇక్కడి వాళ్లు మమ్మల్ని హింసిస్తారు. ఈ సిరీస్ ఆడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం' అని పాక్ హిందువులు అంటున్నారు.