జగన్ ఆకర్షణ శక్తి తగ్గిందా?
posted on Oct 13, 2012 @ 10:20AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోనరెడ్డి చంచల్‌గూడజైలులో ఉన్నంత కాలం ఆ పార్టీలోకి వచ్చే వలసల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి కేంద్రంలో కాంగ్రెస్‌తోనే కలిసుంటామన్న మాటతో కాంగ్రెస్ అధిష్టానంలోని నేతలను ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో తాము ప్రత్యేకపార్టీగానే ఉంటామని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఈమెతో ఆ మాట చెప్పిస్తున్న జగన్ ఎలాగైనా తాను బయటకు వస్తే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చే వారితో 2014 అధికారం సొంతం చేసుకోవచ్చని కలలు కంటున్నారు. ఈ కలలు సంగతెలా ఉన్నా ఈపాటికే పార్టీకి విపరీతమైన స్పందన వచ్చేస్తుందని మొదట్లో అందరూ అంచనా వేశారు. ఊహించినంత స్పందన అయితే లేదు. కానీ, ఇడి ఆస్తుల సీజ్ ప్రతిపాదన విన్న తరువాత కొందరు వెనుకడుగువేశారని తెలుస్తోంది. అలానే జగన్ ఆస్తులన్నీ సీజ్ అయితే మనకేమి చేస్తారన్న డౌట్ కూడా కార్యకర్తల్లోనూ వస్తోంది. దీంతో కొందరు బయటపడ్డనేతలు మినహా మిగిలిన వారందరూ అసలు పరిస్థితి ఏమిటీ? అన్న పరిశీలనలో ఉన్నారు. తాజాగా సినీనటుడు మోహన్‌బాబు తాను వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నారు. అలానే నల్గండజిల్లా భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరిద్దరు కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఓ ఇద్దరు నేతలు మినహా మిగిలిన వారందరూ వెనుకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా జగన్ పార్టీలో చేరటానికి సిద్ధమైన నేతలకు కొందరు ఎమ్మెల్యేలు తామే ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని సలహాలు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి గోళ్లు గిల్లుకునే బదులు అవసరమైన పని ఉన్నప్పుడే నువ్వు పార్టీలోకి వద్దువుగానీ ఆగిపోమ్మని చెబుతున్నారట. ఇలా ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పటంతో ఊడా స్థానికంగా ఉండే వలసలు కూడా కొంత మేర తగ్గాయి.