తమ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షనల్ నాయకురాలు, జగన్ సోదరి షర్మ
posted on Oct 13, 2012 @ 10:17AM
అసలు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై ఏకాభిప్రాయం సాధ్యమా? ప్రస్తుత వాతావరణం పరిశీలిస్తేనే ఇది అసాధ్యమని చిన్నపిల్లలు కూడా తేల్చి చెప్పేస్తారు. అటువంటిది రాజకీయమేథావులు ఉన్న తెలంగాణ ప్రాంతీయులు ఎందుకు అనవసరంగా ఒకపార్టీని, కొందరు నేతలను అడ్డుపెట్టుకుని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కొందరు స్వార్థం కూడా ఉద్యమరూపం దాల్చవచ్చు. కొందరు బలికి కూడా కారణం కావచ్చు. కానీ, అసలు అవకాశం లేని అంశాన్ని ఆశగా చూపి తాము నేతలుగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారిని పసిగట్టలేకపోతే ఎలా? తెలంగాణాఅభివృద్థికి చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కోరితే సరిపోయేది. అలాంటిది ప్రత్యేక తెలంగాణా పేరిట ఇంకెన్నాళ్లు కూలీల పొట్టకొడతారు? విద్యార్థుల చదువులకు విఘాతం కల్పిస్తారు? ఉద్యమం అన్నప్పుడల్లా కూలిపని మానేసి వస్తున్న అమాయకప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చే కన్నా సరైన నిర్ణయం తెలంగాణాలోనే తీసుకోవాలి. ప్రత్యేకరాష్ట్రం అన్న ప్రతిపాదన ఆధారంగా తెరాస(తెలంగాణారాష్ట్రసమితి) ఏర్పాటైంది. ఈ పార్టీ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్పీకర్ పదవిని వదిలేసి తెలంగాణా ఉద్యమం పేరిట నేతగా ఎదిగారు. ఆయన తన ఎదుగుదల కోసం తెలంగాణా రేపే వచ్చేస్తాది...జల్దీగా శుభవార్త ఇంటాం జరా మందిని తోల్కని రారాదే...అంటూ గడువులు పెడుతూ కాలం గడిపారు. అసలు ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం అనే దానిపై అవగాహన లేని కాంగ్రెస్ అధిష్టానంలో కొందరు కూడా ఈ కేసీఆర్ స్టేట్‌మెంట్లకు తలగ్గారు. కానీ, అదే నాయకులు వాస్తవాలు తెలుసుకుని అసలు తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అనేది అసాధ్యమని తేల్చేస్తున్నారు. మొదట్లో అలానే మొగ్గుచూపిన రాష్ట్రకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీఆజాద్ ఇప్పుడు తెలంగాణా అసాధ్యమంటున్నారు. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఏకాభిప్రాయం వస్తేనే తెలంగాణా సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ తాను ఢల్లీలో బోల్డెన్ని మంతనాలు చేశానని కథలు చెబుతున్న కేసీఆర్ గుటకలు మింగాల్సి వస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయం మార్చుకోలేదని ప్రజలకు అర్థమైంది. తెలంగాణావాదులకు మాత్రమే కేసీఆర్ నాటకాలు ఇంకా అర్థం కాలేదు. అసలు ఢల్లీలో అందరు నేతలను ఒప్పిస్తే ఆజాద్ ఇలా ఎందుకు స్పష్టంగా మాట్లాడతారు? ఒక్కసారి తెలంగాణావాదులూ ఆలోచించండి!