నిరాశలో జగన్ అభిమానులు
posted on Oct 8, 2012 @ 5:07PM
వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్నా ఫలితం లేక పోయింది. సుప్రీంకోర్టు బెయిలు నిరాకరించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించింది. సిబిఐ తిరుగులేని సాక్ష్యాలను చూపింది. దాల్మియా గ్రూప్ సీనియర్ ఉద్యోగుల పేరిట తీసుకున్న లాకర్లలో 14 కోట్ల రూపాయల నగదు, 5 కోట్లు విలువ చేసే బంగారం దొరికింది. అంతకంటె విలువైన హార్డు డిస్కుకూడా దొరికింది. దానిలో క్విడ్ ప్రోకోగా చెపుతున్న దినేష్ దాల్మియాకు సిమెంట్ కంపెనీ కోసం 140 కోట్ల కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అందులో 55 లక్షలు జగన్‌కు దక్కినట్లు మిగతా ఇవ్వవలసి ఉన్నట్లు ఉంది. దినేష్ దాల్మియా విచారణ కూడా ఇదే బయటపడినట్లు సమాచారం. అంతే కాకుండా ఐటి దాడుల్లో కూడా ఇదే విషయం బయట పడినట్లు కోర్టుకు రుజువులు చూపుతూ ఎంతో మంది పేరొందిన రాజకీయనాయకులగా వున్నవారు దీని వెనుక ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి వారందరిని విచారించడానికి గాను ఇంకా వ్యవధి కావాలని సిబిఐ తరుపున వాదిస్తున్న న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి 3 వేల కోట్ల ఆస్ధుల్ని గుర్తించామని సిబిఐ తెలిపింది. జగన్ బయటికి వస్తే సాక్షులను ప్రలోభపెడతారన్న వాదనకు సుప్రీం కోర్టు ఏకీభవించింది. అంతేకాకుండా పూర్తి విచారణ జరిపే వరకు బెయిల్ ఇవ్వకూడదని కూడా సీబిఐ వారనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో మరో మూడు నెలల వరకు బెయిలు మంజూరు చేయవద్దని కూడా వారు న్యాయమూర్తిని కోరారు. దీంతో వైయస్సార్ సిపి పార్టీలో నిరాశా, నిసృహ ఆవరించింది.