విజయమ్మ మీదే జగన్ పార్టీ భారం
posted on Oct 8, 2012 @ 5:48PM
జగన్‌కి ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడంలేదు. కనీసం మూడు నెలల పాటు జగన్ కి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ గట్టిగా కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ వేసిన పిటిషన్ జగన్ తో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ కి కుడా పెద్దదెబ్బని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ భారం పూర్తిగా విజయలక్ష్మి భుజాల పైనే ఉన్నట్లు లెక్క షర్మిల, భారతి ఆమెకు చేదోడువాదోడుగా నిలబడక తప్పదు. వచ్చే ఎన్నికల నాటికి కుడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే మళ్ళీ ఉపఎన్నికల్ నాటి సీన్ పునరావృతం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. మరో వైపు చంద్రబాబు ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు పాదయాత్ర చెప్పట్టారు. వెళ్ళిన చోటాళ్ళ బాబుకు జనం జేజేలు కొడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న జనం బాబు వైపుకి మళ్ళి పోకు౦డా చుసుకోనేందుకు వైకాపా నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రయత్నంలో విజయలక్ష్మి పై భారం అ౦తకంతకి పెరిగిపోతోంది.