చంద్రబాబు యాత్రలో లిటిల్ స్టార్ సందడి
posted on Oct 8, 2012 @ 12:27PM
చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మీ కోసం యాత్రలో ఓ లిటిల్ స్టార్ సందడి చెస్తున్నాడు. ఆరు రోజులుగా అనంతపురంలో చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో ఆయన వెంట పాదయాత్రలో పాల్గొంటున్నాడు. ఇంతకీ ఇతను ఎవరంటే, ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన ఈ లిటిల్ స్టార్ పేరు అరవింద్. రెండో తరగతి చదువుతున్నాడు. పదేళ్ల లోపు వయస్సు ఉన్న ఈ బుడతడు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తనని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితె చంద్రబాబు సిఎం కావాల్నదే తన కోరిక అని చెప్పుతు అందర్ని ఆకట్టుకుంటున్నాడు.