షర్మిల బాణం ఏ లక్ష్యం కోసం : బొత్స
posted on Oct 19, 2012 @ 4:52PM
జగన్ సోదరి షర్మిల బాణం ఎవరిపైకి, ఏ లక్ష్యం కోసం పెట్టారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. షర్మిల బాణాన్ని జగన్ చేసిన నేరాలు, ఘోరాలపై వేస్తే మంచిదని అన్నారు . దివంగత వైఎస్ పేరును ఛార్జీషీట్‌లో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదని, సీబీఐ పెట్టిందని చెప్పారు. జగన్ కేసులకు కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యులే ఇటీవల చెప్పారన్నారు. సొంత పార్టీ ఎంపీలు చెప్పిన విషయాన్ని జగన్ కుటుంబం మరిచిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. షర్మిల బాణం ఎవరి పైకి ఎక్కుపెట్టారో తనకైతే తెలియదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు.