పవన్ కళ్యాణ్ సినిమా, పూరీ ఆఫీస్ పై దాడి
posted on Oct 19, 2012 @ 5:15PM
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలంగాణ వాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ వాదులు జూబ్లీహిల్స్లోని పూరీ జగన్నాథ్ కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. ఆయన కార్యాలయం ఆవరణలో ఉన్న నాలుగు కార్ల అద్దాలు పగులగొట్టారు. ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలంగాణవాదులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు నిరసన తెలిపారు. ఆ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు తెలంగాణ జిల్లాల్లో నిరసనల వెల్లువెత్తాయి. తెలంగాణవాదులు పలుచోట్ల థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే వివాదాస్పద సన్నివేశాలు, మాటలు తొలగిస్తామని పూరీ జగన్నాథ్ చెప్పారు.