తెలంగాణాలో రాంబాబు రచ్చ, టీఆర్ఎస్ ఫైర్
posted on Oct 19, 2012 @ 3:48PM
దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలంగాణవాదులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. జరగబోయే పరిణామాలకు తాము ఏమాత్రం బాధ్యులం కాదన్నారు. సినిమా ఇండస్ట్రీని తాము ఎప్పుడూ టార్గెట్ చేయలేదని చెప్పారు. కాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని తెలంగాణ న్యాయవాదులు హెచ్చార్సీని ఆశ్రయించారు. కాంగ్రెసు పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలంగాణకు మోసం చేస్తే పవన్ కల్యాణ్ ఇలా చేశారని టిఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. తాము ఈ సినిమాను చూసే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చి లాభాలు గడించాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. దీనిని తెలంగాణవ్యాప్తంగా అడ్డుకుంటామన్నారు. తెలంగాణవాదుల ఆందోళనలపై కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు స్పందించారు. పూరీ జగన్నాథ్‌తో మాట్లాడి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. సినిమాకు అడ్డుకోవద్దని తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు.