Read more!

వాయు కాలుష్యం,పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు అనారోగ్యానికి కారణం...

ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్చవం 2౦22 సందర్భంగా ఊపిరి తిత్తుల ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పుకోక తప్పదు.ఈసందర్భంగా కే జి ఎం యు లక్నో మాజీ అధ్యక్షుడు ఊపిరి తిత్తుల వ్యాధి నిపుణులు పల్మనాలాజి వైద్యుడు డాక్టర్ సూర్యాకాంత్ మాట్లాడుతూ వాయు కాలుష్యం,పొగతాగడం వల్లే ఊపిరి తిత్తులపై తీవ్రప్రభావం చూపుతుందని ఈకారణంగానే నిమోనియా,తో పాటు ఇతర అవయవాల పై తీవ్రప్రభావం చూపుతుందని. ఊపిరి తిత్తుల అనారోగ్యానికి గురి అవుతున్నాయాని సూర్యకాంత్ అభిప్రాయ పడ్డారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫోరం ఫర్ ఇంటర్ స్తైనల్ రేస్పెరేటరీ సొసైటీ ద్వారా 25 సెప్టెంబర్ న ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఊపిరి తిత్తుల ఆరోగ్యం పట్ల ప్రపంచవ్యాప్తంగా జాగృతం చేయడం ముఖ్య లఖ్యమని వివరించారు .కాగా కరోనా మహమ్మారి మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిందో అందరికీ తెలుసు.

ఈకారణంగానే ఈసారి లంగ్ హెల్త్ అంటే ఊపిరి తిత్తులు  ఆరోగ్యం గా ఉండాలని సరిగా పనిచేస్తేనే వ్యక్తిఆరోగ్యంగా ఉంటాడని అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం2౦22 లక్ష్యం శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల ప్రజలకు తలకు మించిన భారంగా మారిందని వీటికోసం అయ్యే ఖర్చు సైతం పెరుగుతూ ఉండడం తో ప్రజలు ప్రతిఒక్కరు ఊపిరి తిత్తుల సంరక్షణ కు గలకారణాలు.ఊపిరి తిత్తుల సంరక్షణ వ్యాధి ప్రస్తుత తీవ్ర స్థితి నేరుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.శ్వాస సంభందిత సమస్యలతో బాధ పడేవారికి సేవలు సపర్యలు చేయడం అత్యవసరమని భావిస్తున్నారు.ఈ అంశం పై ప్రపంచంలోని అన్నిదేశాలు తప్పనిసరిగా పరస్పర సహకారం అవసరమని నిపుణులు సూచించారు. ఊపిరి తిత్తులలో వచ్చే సమస్యల కారణంగా టి బి,ఆస్తమ,సి ఓ పిడి,నిమోనియా,ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మారో 5 రకాల శ్వాస సంభందిత రోగాలు ఉన్నాయి.వాయుకాలుష్యం,పోగాతాగడం,నీటి కాలుష్యం,వాయుకాలుష్యం,లో వచ్చే మార్పులు ఊపిరి తిత్తుల అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.రోగాలను పెంచుతాయి.

వాయు కాలుష్యం వల్ల ప్రమాదం..

వాయుకాలుష్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం లో వస్తున్న మార్పులు ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది.ఇది ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా పరిణ మిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచం లో 7౦ లక్షల మరణాలకు కారణం వాయులాలుశ్యమే అని నిపుణులు నిర్ధారించారు. వాయుకాలుష్యం కారణంగా ప్రతిఎతా 17 లక్షల మంది మరణిస్తున్నారని.వాయుకాలుష్యం ప్రభావం ఉందన్న కారణంగా నిత్యం ఆర్ధికంగా 8 అరబ్ డాలర్ల ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని అభిప్రాయ పడ్డారు.దీనిప్రభావం ప్రపంచ ఉత్పాదక రంగం పై ౩%నుండి 4%నష్టానికి గురికావడాన్ని గమనించినట్లు నిపుణులు పేర్కొన్నారు.

డిల్లీలో అత్యధిక వాయుకాలుష్యం..

ప్రపంచ వాయు కాలుష్య నియంత్రణా మండలి రిపోర్ట్ ప్రకారం 2౦21 నాటికి ప్రపంచ లో వాయుకాలుష్య రాజధాని డిల్లి ఉండడం గమనార్హం.గత సంవత్సరం తో పోలిస్తే 15%కాలుష్యం పెరిగింది. 2౦21 లో అన్నిటికన్నా అత్యంత దరిద్రమైన వాయు ప్రమాణాలు ప్రపంచంలోని 5౦% పట్టణాలలో ౩5 పట్టణాలు భారత్ లోనే ఉన్నాయి అని నివేదికలో పేర్కొన్నారు.1౦౦ పట్టణాలలో 6౩ పట్టణాలు భారత్ లోనే  ఉండడం గమనార్హం. మే 2౦22 లో ప్రోంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన రిపోర్ట్  ఆధారంగా పొగాకు,సిగరెట్ తయారు చేసేందుకు 6౦ కోట్ల చెట్లు ప్రతిఏటా సంహరించడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.ఆఫలితంగానే ప్రపంచంలో పర్యావరణ సమతౌల్యం లోపించి వాతవరణంలో పెనుమార్పులకు కారణంగా పర్యా వరణ శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్త్గం చేస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాకృతిక విధ్వంసానికి పూనుకుంటారో దానివల్ల వచ్చే ఫలితం ఎంత భయంకరం గా ఉంటుందో అంచనా వేయలేమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అన్నిటికన్నా అత్యంత భయంకరమైన విషయం ఏమిటి అంటే 15౦ హెక్టార్ల అటవీ ప్రాంతం పొగాకు కారణంగా అటవీ సంపద నాశనం అయ్యిందని పేర్కొన్నారు.

దీనికి తోడు పొగాకు,బీడీ,చుట్ట,సిగరెట్ తయారీకి 22౦౦ కోట్ల లీటర్ల నీటిని దుర్వినియోగం చేసారని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నీటిని దాదాపు 2 కోట్ల ప్రజల దాహం ఆకలి తీర్గలిగే వారాని పొగతాగడం వల్లే ప్రపంచానికి ముప్పు పొంచిఉందని.ప్రపంచ పర్యావరణానికి తీవ్ర పరిణామాలు తప్పవని గ్లోబల్ వార్మింగ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధూమపానం పొగతాగడం వల్ల 84 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోందని ఈకారణంగా ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.మనదేశం లో దాదాపు 12 కోట్ల ప్రజలు పొగాకు సేవిస్తున్నారని.ఎవరైతే పోగాతాగుతున్నారో ఆ వ్యాక్తి విడుదల చేసే పొగ ౩౦ %ఊపిరి తిత్తులలోకి చేరుతోందని మిగిలిన 7౦%పొగ ఆవ్యక్తికి దగ్గరాగా ఉన్న వ్యక్తుల లోని ఊపిరి తిత్తులలోకి చేరి తీవ్రనష్టం కలిగిస్తోందని నిపుణులు ద్రువీకరిస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పెసివ్ స్మోకింగ్ చేసే వారికి వారు పోగాతాగిన వారితో సమానమే అని అది మీఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుందని పల్మనాలజిస్ట్లు లు  హెచ్చరిస్తున్నారు.అది అత్యంత నష్ట దాయకమైన అంశమని మీరు పోగాతీసుకోవడం ద్వారా విడుదల అయ్యే పొగ వాతావరణానికి కలుషితం చేస్తోందని అన్నారు.

రసాయనాల ద్వారా ఆరోగ్యానికి ముప్పు..

మన శ్వాస నాళాలు పర్యావరణం లో ఉన్న రకరకాల్ హానికారకాలు ఏజెంట్లు కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం తో ఊపిరి తిత్తుల పై  తీవ్రప్రభావం చూపుతోంది.ప్రపంచంలో రెండు అరబ్ కోట్ల ప్రజలు బయోమాస్ ఇంధనం దహనం చేయడం వల్ల ఉత్పన్న మౌతున్న విష పదార్ధాలు, పొగలు, బారిన పడ్డప్పుడు రెండు అరబ్ కోట్ల ప్రజలకు పై గానే వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.ప్రధాన మంత్రి ఉజ్వల పధకం కింద బయోమాస్ ఇంధన వినియోగం  తగ్గడం వల్ల మహిళల ఊపిరితిత్తుల ఆరోగ్యం లో మంచి ఫలితాలు వచ్చాయి.

అందరి బాధ్యత..

పర్యావరణం కాపాడుకోవడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం రక్షించుకోవడం ముఖ్యం. ఏది ఏదైనా సమావేశం జరిగినప్పుడు సభలు జరినప్పుడు ఒక గులబీ పూల బోకే లేదా పూలబుట్టను గిఫ్ట్ గా ఇవ్వడం పూలతో స్వాగతం పలకడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.అయితే వాటి స్థానం లో చిన్న చిన్న చెట్లు మొక్కలు ఇవ్వవచ్చు. ఎవరిపుట్టినరోజున అయినా 
ఆసంవత్సరం లో జరిగే ఉత్చవాల లో చెట్లు మొక్కలను పెతాలి తద్వారా అందరికీ కాలుష్యం లేని ఆక్సిజన్ అందరికీ అందుతుంది మనం ఊపిరి తీసుకున్నప్పుడు ౩5౦ నుండి 5౦౦ లీటర్ల ఆక్సిజన్ ప్రతిరోజూ మనకు అవసరం. ముఖ్యంగా 65 సంవత్సారాల వయస్సు ఉన్నవారు దాదాపు 5 కోట్లమంది ఉంటారు వారికి ఆక్సిజన్ మొక్కలు చెట్లద్వారానే ఏమాత్రం ఖర్చులేకుండా పొందవచ్చు.అందుకు మనంమొక్కలకు చెట్లకు కృతజ్ఞత చేపుకోవాలి అందుకోసం మనం ఎక్కువ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో చెట్లను నాటాలి.

తరువాత మనచుట్టూ ఉన్న చెట్లను సంరక్షించాలి.అలాకాకుండా ఎరాటోసిన్ ఇతరటీకాలు చికిత్చలకు సలహాతీసుకోవాలి అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలాలో మాస్క్ వినియోగించాలి. మాస్క్ వినియోగించడం వల్ల కోరోనా నుండి రక్షించుకోవచ్చు.దీంతో పాటు టి బి నిమోనియా లాంటి తీవ్రమైన వ్యాధులు వాయుకాలుష్యం నుండి రక్షించుకోవచ్చు.అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజూ నడక సాగించాలి. సైకిల్ ను వినియోగించడం. ప్రభుత్వ రవాణా వ్యవాస్త ఎలక్ట్రికల్ కార్లు ఉపయోగించాలి. దీనితో పాటు పొగతాగడం మధ్య పానం తీసుకోవడం ఇతర మత్తు పదార్దాలకు దూరంగా ఉండడం అవసరం. శాఖాహారం భోజనం అయారుతువులలో దొరికే పండ్లు ఆకు కూరాగాయలు, వాడాలి.మీఊపిరి తిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఆవిరి పట్టాలి మరియు యోగా ప్రాణాయామం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి తద్వారా మీఊపిరి తిత్తులు అనారోగ్యం పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.