మహిళల టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

మహిళల టి20 వరల్డ్ కప్ 2023కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు స్కిప్పర్ గా హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మందానలను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి విదితమే. 

ఈ టోర్నీ కోసం   వుమెన్స్ సెలెక్షన్ కమిటీ 15 మంది  ప్లేయర్స్ తో టీం ఎంపిక చేసింది. ఈ జట్టులో శిఖా పాండేకు చోటు లభించింది.  దక్షిణాఫ్రికా వేదికగా    ఫిబ్రవరి 10వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది.  

గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఐర్లండ్, భారత్ ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్ దాయాది   పాకిస్థాన్ జట్టుతో కేప్ టౌన్ లో వల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది.  ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

Teluguone gnews banner