రౌండప్ 2022 ఢిల్లీలో వాయు కాలుష్యం

నవంబర్ 

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..

నవంబర్ 2...  దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) కల్కాజీ ప్రాంతంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజల కోసం నిర్మించిన 3,024 ఫ్లాట్స్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.  
నవంబర్ 3.. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్’ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీడియా  మీడియాకు వివరించారు. ప్రధానమంత్రి నరెంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్’లో రెండు విడతలలో డిసెంబర్ 1, 5 వ తేదీలలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓటల్ లెక్కింపు చేపడతారు. 
నవంబర్ 4.. ఢిల్లీ కాలుష్య స్థాయి పెరుగుతున్న నేపధ్యంలో.,, వాహానాల నియంత్రణకు సరి .. బేసి విధానాన్ని మరో మారు అమలు  చేయాలని భావిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. అలాగే, ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం’ సిఫార్స్ చేసింది .  
నవంబర్ 8...  గుజరాత్ శాసన సభకు వరసగా11 మార్లు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,గిరిజన ఎమ్మెల్యే  మొహన్’సిన్హ బీజేపీలో చేరారు. 
నవంబర్ 9... గుజరాత్ మాజే ముఖ్యమంత్రి విజయ్ రుపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్’ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్యదం లేదని ప్రకటించారు. విజయ్ రూపనీ 2016 ఆగష్టు 7 నుంచి 2021 సెప్టెంబర్ 13 వరకు గుజరాత్ ముఖ్యంత్రిగా ఉన్నారు ..
నవంబర్ 12..  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది.
నవంబర్ 19...  అరుణాచల్ ప్రదేశ్’లో ప్రప్రధమ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశానికీ స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి 2014 వరకు ఈశాన్య భారతంలో కేవలం 9 విమానాశ్రయాల నిర్మాణం జరిగితే, తమ ప్రభుత్వం ఏడేళ్ళలో ఏడు విమానాశ్రయాలను నిర్మించింది ప్రధాని పేర్కొన్నారు.
నవంబర్ 21...  యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటీషన్ దాఖలు  చేసిందని, ప్రభుత్వం తెలిపింది.

Teluguone gnews banner