మహిళల వన్డే వరల్డ్ కప్.. ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఇండియా
posted on Oct 31, 2025 6:15AM
మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లీచ్ ఫీల్డ్ 119 పరుగులతోనూ, ఎలీస్ పెర్రీ 77 పరుగులతోనూ చెలరేగడంతో 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 48.3 ఓటర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడి 127 పరుగులతో నాటౌట్ గా నిలవగా, స్కిప్పర్ , హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో రాణించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరగా, ఆస్ట్రేలియా జట్టు ఓటమితో టోర్నీ నుంచి వైదొలగింది. నవంబర్ 2న జరిగే ఫైనల్ లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
వరల్డ్ కప్ అందుకోవాలన్న లక్ష్యానికి టీమ్ ఇండియా విమెన్స్ టీమ్ ఒక్క అడుగు దూరంలో ఉంది. చావో రేవో అన్న సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆసిస్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. జెమియా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీలో చెలరేగింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడింది. రఫ్పాడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) సైతం అద్భుతంగా రాణించి సెంచరీ మిస్ చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్ దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమె 119 పరుగులు చేయగా, . ఎలీస్ పెర్రీ 77 పరుగులతో రాణించింది, . ఆష్లీన్ గార్డ్‌నర్ చివరిలో మెరుపు ఇన్నినంగ్స్ ఆడి 66 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో శ్రీచరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.