చేనేతల ఆకలికి నిరసనగా ‘బాబు’ ఉపవాసం
posted on Oct 20, 2012 @ 11:06AM
చేనేత కార్మికుల ఆకలి కేకలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ముందస్తుగా తన నిరసన తెలిపేందుకు ఒక పూట ఉపవాసం చేస్తానని ప్రకటించి ఆ ప్రకారం ఉపవసించారు. తన హయాంలో సిరిసిల్లలో చేనేత వస్త్రాల ఎగుమతికి చేసిన ప్రయత్నాలు ఆయన గుర్తు చేసుకున్నారు. 13మంది నేతకార్మికుల బలవన్మరణాలకు బాబు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పోకడ వల్ల కొన్ని జీవితాలు ఆరిపోతున్నాయని వాపోయారు. తన మానవత్వాన్ని చాటుకునేందుకు ఉపవాసం ప్రకటించారు. అలానే చేనేత కార్మికులకు అన్నివేళలా అండగా ఉంటానని చెబుతూ తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రూ.1000కోట్ల ఆర్ధికప్యాకేజీ అమలు చేస్తామన్నారు. వైఎస్ హయాంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మరింత దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఈ తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు కష్టాలనే రుచిచూపిందన్నారు. చివరిగా తన వంట బాధ్యత వహించే సిబ్బందిని పిలిచి రాత్రికి ఏ ఆహారం అవసరం లేదని తెలిపారు. దీంతో బాబు ఉపవాసం చేసి ప్రభుత్వవైఖరిపై నిరసన ప్రకటించారు.