అశ్లీల చిత్రం వుమెన్ ఇన్ బ్రాహ్మిణిజం
posted on Oct 31, 2012 @ 3:17PM
సినిమాలలో ఆడవారిని అశ్లీలంగా చూపడం మామూలైపోయిందని, కధలు కూడా అందుకు తగ్గట్లుగానే తయారవుతాయి, హీరో కాస్త ఏడిపించడానికి, లేదా రెండు మూడు పాటలు విదేశాలలో తీయడానికి అంతకు మించి ఉపయోగం ఉండటం లేదంటున్నారు మహిళా ప్రేక్షకులు. ఇదివరలో హీరోయిన్స్ కి కాస్ట్యూమ్ ఖర్చులుండేవి. ఇప్పటి నిర్మాతలకు అలాంటి ఖర్చులుండటం లేదంటున్నారు పాతతరం ప్రేక్షకులు. అయితే ఇంతకన్నా దారుణంగా నీలి చిత్రానికి ఎ విమెన్ ఇన్ బ్రాహ్మిణిజం పేరుతో నిర్మాత, ధర్శకుడు గంగాధర్ తీసారని మహిళలు ఛీత్కరిస్తున్నారు. ఇది కేవలం పేరుకు మాత్రమే భ్రాహ్మణ అని ఉందని, చిత్రం మొత్తం స్త్రీలను కించపరిచేదే అని ప్రేక్షకులు చెబుతున్నారు. దర్శకుడు చలం పేరును ఉపయోగించుకుంటూ తన వికారపు చేష్టలన్నీ బయట పెట్టుకున్నారని విమర్శకులు చెబుతున్నారు. అంతే కాకుండా సినిమా డైరక్టర్ అనాధాశ్రమంలోని వారితో యాక్టు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. నెగెటివ్ టాక్ తో సినిమా ప్రమోషన్ కోసం ప్రముఖ ఛానల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాటి విశ్లేషకులు, ఫోన్స్ చేసిన ఆడియన్స్ పిచ్చి తిట్లు తిట్టారు. అసలు ఈ సినిమా తీయటానికి ఖర్చు చేసిన డబ్బులే ఒంగోలు నుండి కర్నూలు వెళ్లే దారిలో ఉన్న గ్రానైట్ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించినవే అని ఆరోపణలు వినవస్తున్నాయి. మహిళలను అందంగా, గౌరవంగా సినిమాల్లోచూపక పోయినా పర్యాలేదు కాని ఇలాంటి చెత్త సినిమాలు తీయాయని కూడదని మహిళా సంఘాలు హెచ్చరిస్తూ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపి వేయాలని కోరుతున్నారు.