సెలబ్రటీలు కాస్త ఆలోచించండి
posted on Oct 31, 2012 @ 3:13PM
వన్ నేషన్ వన్ కార్డ్ పేరుతో దేశమంతా తమ సేవలను విస్తరిస్తున్నామని సెలబ్రటీలను బుక్ చేశారు వికె సాయికుమార్. వివరాల్లోకి వెళితే వన్ కార్డు లోనే భ్యాంకింగ్ సేవలు, ఆధార్, ఐడెంటిటి ఇంకా అనేక సర్వీసులను అనుసంధానం చేశామని దాని ప్రచారానికి గానూ సౌరవ్ క్రికెటర్ సౌరవ్ గంగూలీని, మంత్రి పోన్నాలక్ష్యయ్యను, సినీతార నమిత, నేషనల్ ఐడల్ శ్రీరమ్, హాస్యనటుడు గండు హనుమంతరావుని తీసికొచ్చి ప్రచారం చేయించారు. అందులో భ్రాండ్ అంబాసిడర్ గా నమితను నియమించారు. సాంకేతిక అంశాలను పరిశీలించిన కొంతమంది దీని పని తీరుపై అద్యయనం చేసి కాస్త తీగలాగేటప్పటికి సాయికుమార్ ఇంత మందితో ప్రమోట్ చేయించడానికి డబ్బు ఎక్కడిదా అని ఆరా తీస్తే అదికాస్త మైనారిటీ కార్పొరేషన్ దని బయటికొచ్చింది దాంతో ఈ సెలబ్రటీలకందరికీ తలనోప్పి వచ్చింది. తాజాగా పోలీసులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది బయటకు లాగుతున్నారు. ఇంతకు ముందు కూడా గంగూలీ ఒక టివి కార్యక్రమంలో ఒక కంపెనీని ప్రమోట్ చేస్తూ చేసిన కార్యక్రమంలోని విజేతలకు డబ్బులివ్వలేదని కూడా గలాటా జరిగింది. కాబట్టి సెలబ్రటీలు కాస్త ఆలోచించుకొని కార్యక్రమాలకు హాజరయితే బావుంటుందని ప్రజలు భావిస్తున్నారు. లేదంటే ఉన్న పేరు పోగొట్టు కోవలసి వస్తుందంటున్నారు.