విజయ్ మాల్యాకి అరెస్ట్ వారెంట్
posted on Oct 12, 2012 @ 5:23PM
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యా మరోసారి చిక్కుల్లో పడ్డారు. చెక్‌బౌన్స్ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. శంషాబాద్ విమానాశ్రయ వినియోగ రుసుంను చెల్లింకచకోవడంతో జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. జీఎంఆర్ పిర్యాదు మేరకు 13వ నగర న్యాయస్థానం విజయ్ మాల్యాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో విజయ్‌మాల్యా కోర్టుకు హాజరుకానందుకు ఆయనపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆయనతోపాటు మరో ఐదుగురిపై హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పదమూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ తీర్పునిచ్చారు. మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనపై కోర్టు వారెంట్లు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని మాల్యా పిటీషన్ దాఖలు చేసుకున్నారు.