మీ అమ్మ హాఫ్ తాగితే నేను క్వార్టర్ తాగుతా.. వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు
posted on Jul 27, 2020 @ 4:20PM
ఇటీవల సోషల్ మీడియాలో కొందరు హద్దు మీరి వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. తమకిష్టంలేని రాజకీయ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన, ముఖ్యంగా ఆడవారిపైన కొందరు నోరు పారేసుకుంటూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తికి టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తమ్ముడూ అంటూనే చురకలు అంటించారు.
ఏపీలో తొమ్మిది గంటల వరకు మద్యం అమ్మడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వంగలపూడి అనిత.. జగన్ సర్కార్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. "తొమ్మిది గంటల వరకు మద్యం అమ్మకాలు తప్పని ఎలా అంటారు?. మద్యంలో ఉండేది ఏంటి? ఆల్కహాల్. కరోనా జాగ్రత్తలో వాడే శానిటైజర్ లో ఉండేది ఏంటి? ఆల్కహాల్. కరోనా జాగ్రత్త కోసం తొమ్మిది గంటల వరకు మా సీఎం కష్టపడితే తప్పా?. రాత్రి 9 నుంచి ఉదయం 10 వరకు మద్యపాన నిషేధం కూడా చేస్తున్నారు. హ్యాట్సాఫ్ సీఎం." అంటూ అనిత ట్వీట్ చేశారు.
అనిత ట్వీట్ పై స్పందించిన కర్ణ అనే యువకుడు.. "ఆంటీకి అలవాటు ఉన్నట్టుండి. మంచిగా ఎక్స్ ప్లైన్ ఇస్తుంది ఆల్కహాల్ గురుంచి. ఎంత రోజు ఒక క్వార్టర్ వేస్తావా." అంటూ దారుణ వ్యాఖ్యలు చేశాడు.
ఆ యువకుడి వ్యాఖ్యలకి అనిత కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. "అవును తమ్ముడు, మీ అమ్మగారు, నేను కలిసే తాగుతామ్. మీ అమ్మ హాఫ్ తాగితే నేను క్వార్టర్ తాగుతా. నా కడుపున సంస్కారం లేని వెధవ పుట్టాడమ్మా అని ప్రతిరోజు ఏడుస్తారు. సన్నాసి ఏమి భాషరా అది.. ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో..." అంటూ అనిత విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియాలో ఆడవారి గురించి పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేసే వారికి.. ఇలానే సమాధానం చెప్పాలంటూ వంగలపూడి అనితపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.