ఏపీలో ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు.. ధర ఎంతంటే?
posted on Jul 27, 2020 @ 4:20PM
ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షకు రూ.2,800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ లాగిన్ లో కూడా పరీక్షల ఫలితాల డేటాను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్‌ల్లో జరిగే పరీక్షలు, ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.