యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే సోమ్‌దేవ్ ఓటమి
posted on Aug 28, 2012 @ 5:10PM
ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. సోమ్‌దేవ్ 3-6, 2-6, 6-3, 4-6 స్కోర్‌తో స్పెయిన్‌కు చెందిన రూబెన్ రమిరేజ్ హిడాల్గో చేతిలో ఓటమి చవిచూశాడు. రెండు గంటల 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ పదే పదే డబుల్ ఫాల్ట్స్ చేశాడు. తొలి రెండు సెట్లను ఈజీగా గెలిచిన హిడల్గో మూడో సెట్‌లో సోమ్‌దేవ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. అయితే నాలుగో సెట్‌లోనూ సోమ్‌దేవ్ తీవ్రంగా పోరాడినా, చివరకు హిడాల్గో పవర్ ముందు చేతులెత్తేశాడు.