కరెంట్ కష్టాలకు పరిష్కారం
posted on Aug 28, 2012 @ 4:05PM
రాష్ట్రంలో ఉన్న కరెంట్ కొరత త్వరలోనే అధిగమిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరెంట్ కొనుగోలు చేద్దామన్నా అందుబాటులో లేకపోవడంతో కరెంట్ కష్టాలు నెలకొన్నాయని అన్నారు. మంగళవారం సీఎం కిరణ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 50 ఏళ్లలో బొగ్గు కొరత ఉంటుందని, అందువల్ల సోలార్, విండ్ బయోమ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తామని కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2.20 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. అందులో 35 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, కరెంట్ సబ్సీడీ కింద రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. కరెంట్‌ను ఎలా ఆదా చేయాలన్న అంశాలపై సీఎం మాట్లాడారు. టీవీ చూడని సమయంలో స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పదిశాతం విద్యత్‌ను ఆదా చేయవచ్చని కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.