జగన్, గాలికి రిమాండ్ పొడగింపు
posted on Aug 28, 2012 @ 5:34PM
జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు కోర్టు వచ్చే నెల 11వ తేది వరకు రిమాండును పొడిగించింది. అలాగే ఓఎంసి కేసులో నిందితులు గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, ఎమ్మార్ కేసు నిందితులు సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, విజయరాఘవలకు కూడా కోర్టు వచ్చే నెల 11వ తేది వరకు రిమాండును పొడిగించింది.