టిటిడి ఉచిత బస్సు బోల్తా
posted on Oct 22, 2012 @ 12:32PM
టిటిడికి చెందిన ఉచిత బస్సు బోల్తాకొట్టింది. ముఫ్పైమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టునుంచి భక్తుల్ని ఎక్కించుకుని తిరుపతికి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు పల్టీకొట్టి కుడివైపునున్న కల్వర్టుని ఢీ కొట్టింది. గాయపడ్డవాళ్లని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంవల్లే బస్సు పల్టీకొట్టిందని ప్రాథమిక సాక్ష్యులు చెబుతున్నారు. టిటిడి ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.