Read more!

ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా?

సాధారణంగా మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కూరలు, పప్పులు అయితే తప్పకుండా పెడుతుంటాం. కావాల్సినప్పుడు వాటిని బయటకు తీసుకుని వేడిచేసుకుని తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఆహారం వేస్ట్ కాకుండా చేశామని అనుకుంటాం. కానీ అనారోగ్యానికి కోరి తెచ్చున్నట్లు అవుతుందని మీకు తెలుసా?

-మాంసాహారం, గుడ్లు, పప్పులు వంటివన్నీ మాంసక్రుత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని మళ్లీ మళ్లీ వేడిచేసినట్లయితే వాటిలో ఉండే మాంసక్రుత్తులు విచ్చిన్నమవుతాయి. ఆమ్లాలు ఉత్పత్తై తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి. వీటిని తాజాగానే తినడం మంచిది. అస్సలు నిల్వ చేయకూడదు.

-ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అందులోని విటమిన్, సి, బి వంటిపోషకాలు నశించిపోతాయి. ఆ ఆహారం తిన్నాకూడా శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

- అన్నం, పాస్తా వంటివాటిని ఎంత కావాలో అంతే వండుకోవాలి. మిగిలిదాన్ని ఫ్రిజ్ లో పెట్టి వేడిచేసి తింటే హానికర బ్యాక్టీరియాని స్వయంగా శరీరంలోకి ఆహ్వానించినట్లవుతుంది.

-ఆలుగడ్డ లేదా బ్రెడ్ వంటి పిండిపదార్థాలను మళ్లీ వేడి చేస్తే క్యాన్సర్ కరకాలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వాటిని తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువసేపు వండటం, ఫ్రిజ్ లో స్టోర్ చేయడం కంటే కావాల్సినంతే వండుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.