Read more!

దేవుడున్నాడని చిన్నతనంలోనే తర్కంతో వాదించిన శాస్త్రవేత్త!

ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులతో, "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడా? అని అడిగారు. "అవును ఆయనే సృష్టించాడు” అని ఒక విద్యార్థి సమాధానమిచ్చాడు.

"భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు. అలాగే చెడును కూడా సృష్టించాడు. కాబట్టి భగవంతుడు చెడ్డవాడు" అని అన్నాడు ప్రొఫెసర్ తీర్మానిస్తూ. “భగవంతునిపై నమ్మకం" అనేది భ్రమ అని వాదించాడు.

"సార్! నేనో ప్రశ్న అడగవచ్చా?”. అంటూ ఓ విద్యార్థి లేచాడు. అడగమన్నాడు ప్రొఫెసర్.

"సార్! చల్లదనం ఉందాండీ" అని అడిగాడు. విద్యార్థి. “అదేం ప్రశ్న! చల్లదనం ఉంటుంది కదా! నీకెప్పుడూ అది అనుభవంలోకి రాలేదా?" అన్నాడు ప్రొఫెసర్.

అప్పుడు ఆ విద్యార్థి "భౌతికశాస్త్రం ప్రకారం చల్లదనం అనేది ప్రత్యేకంగా లేదు కదా సార్. ఉష్ణోగ్రత లేకపోవడాన్నే చల్లదనమని అనుకుంటున్నాం. వస్తువులో ఉష్ణోగ్రత  లేదు గనుక, వేడిగా లేదని చెప్పడానికే మనం అనే చల్లదనం అనే పదాన్ని ఉపయోగిస్తాం” అన్నాడు.

అవును నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ప్రొఫెసర్.

అయితే మరొక ప్రశ్న సార్.. “చీకటి ఉందా?” అని మళ్ళీ ప్రశ్న వేశాడు విద్యార్థి. 

 "అవును, ఉంది కదా” అన్నాడు ప్రొఫెసర్.

"మళ్లీ మీరు పొరబడ్డారు!" అంటూ ఆ విద్యార్థి ఇలా చెప్పాడు.

 “సార్, చీకటి అనేదే లేదు. వెలుతురు లేకపోవడాన్నే మనం చీకటి అంటున్నాం. వెలుతురును అధ్యయనం చేయగలం గానీ, చీకటిని అధ్యయనం చేయలేము. అని అన్నాడు. ఆ మాట విని ప్రొఫెసర్ చాలా నిశ్శబ్దం అయిపోయాడు. 

సార్ ఇంకొక ప్రశ్న.. చివరి ప్రశ్న ఇదే..  "మరి చెడు ఉందాండీ?" అని చివరి ప్రశ్న సంధించాడా విద్యార్థి. 

"అవును ఉంది. నేను మొదటే చెప్పానుగా, ఈ లోకంలో ఘోరాలు, హత్యలు. అన్నీ చెడే కదా" అన్నాడు ఆవేశంగా ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి "సార్.. మనిషి హృదయంలో చెడు అనేదే లేదు, మంచి లేకపోవడమే చెడు అంటున్నాం.  అంటే భగవంతుడు లేకపోవడాన్నే పాపం అనే పదంతో నిర్వచిస్తున్నాం"  అని జవాబిచ్చాడు.

ఆ తర్కానికి కంగుతిన్నాడు ప్రొఫెసర్. తాను ఓడి పోయానని అంగీకరిస్తూ ఏమీ వాదించలేక తల దించుకున్నాడు. అంతటి ప్రొఫెసర్ని కూడా తర్కంతో భగవంతుడు ఉన్నాడని ఒప్పించిన ఆ విద్యార్థి ఎవరో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.

                                 ◆నిశ్శబ్ద.