తెలంగాణ పాఠశాలల్లో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు తప్పని సరి!
posted on Feb 26, 2025 @ 12:10PM
తెలంగాణలోని అన్ని పాఠశాతల్లోనూ తెలుగుబోధన ఇక తప్పని సరి. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. పాఠశాలల్లో మాతృభాష బోధన తప్పని సరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తెలుగు బోధనను నిర్బంధం చేస్తూ చట్టం అమలులో ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలు కాని పరిస్థితి ఉంది.
దీంతో తెలంగాణ సర్కార్ ఆ చట్టాన్ని పక్కాగా అములు చేయాలన్న ఉద్దేశంతో తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వుల మేరకు 2025-26 నుంచి అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులకు తప్పనిసరిగా తెలుగు బోధన అమలు చేస్తారు. పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇది సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్ చదివేవారికీ వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజీగా తెలుగు తప్పని సరి.