కిరణ్‌పై హక్కుల తీర్మానం ఏమైందీ?
posted on Oct 15, 2012 @ 10:00AM
ఇప్పటి వరకూ దేశచరిత్రలో ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు. ఇటువంటి క్రమశిక్షణారాహిత్య ఘటనకు నాందీప్రస్తావన పలికిన ఘనత తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ఎంపిలకే దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై హక్కుల తీర్మానం పెట్టాలని ఈ ఎంపిలు లోక్‌సభ స్పీకర్‌ను కోరటం కాంగ్రెస్‌పార్టీ చరిత్రలోనే (తొలిసారి) మాయని మచ్చ. అదీ రాతపూర్వకంగా పంపించటం కూడా ఎవరూ మరిచిపోలేరు. ఒకే పార్టీలో ఉంటూ ఎంపిలు సిఎంపై కక్ష పూనటం వారి వ్యక్తిగత ముద్రను మాత్రమే చాటుతోంది. దీని వల్ల కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్‌గా రాష్ట్ర పరిస్థితి పరిశీలించటం ప్రారంభించింది. అస్సలు క్రమశిక్షణారాహిత్యాన్ని భరించటంలో కాంగ్రెస్ పార్టీ తరువాతే ఎవరైనా అన్నట్లు అధిష్టానం వేచి చూస్తోంది. అస్సలు ఈ ఎంపిలు ఎలా ప్రవర్తిస్తారు అన్న అంశంపై మాత్రం నిఘా పెట్టింది. ఆ నిఘాలో ఎంపిలు చేస్తున్న తప్పులు ఒక్కొక్కటి అధిష్టానం దృష్టికి వెళుతున్నాయి. తెలంగాణా జెఎసితో సంబంధాలు పెట్టుకోవటం వరకూ పెద్దగా ఫీలవ్వని కాంగ్రెస్ మార్చ్‌ఫాస్ట్‌కు ఎంపిలు ఎందుకు వెళ్లారు అన్న విషయంపై పలువురి అభిప్రాయం తెలుసుకుంటోంది. ప్రత్యేకించి ఈ ఎనిమిది మంది తాజాగా కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ ఆర్‌ఎల్‌డి పార్టీ శాఖకు పరోక్షంగా మద్దతు ఇచ్చారని కనుగొంది. దీనికి తోడు అజిత్‌సింగ్‌తో వీరు ఎక్కువసేపు గడపటం వంటి విషయాలను కాంగ్రెస్ అధిష్టానం రికార్డు చేయించిందని తెలిసింది. ప్రత్యేకించి ఈ ఎనిమిది మంది ఎంపిల ఫైళ్లు అధిష్టానం రూపొందిస్తోందని తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఎంపిలపై కాంగ్రెస్‌పార్టీ మొత్తం ఫైర్ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అయితే కిరణ్‌పై వీరు పెట్టిన హక్కుల తీర్మానం అంశం గురించి లోక్‌సభ స్పీకర్ ఇంకా ఆలోచించలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ తీర్మానంపై చర్చ రాకముందే వీరి గురించి బయటపడవచ్చని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీఆజాద్ కూడా తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పరోక్షంగా ఎంపీలను హెచ్చరించారు. కొనసాగింపుగా తాము ప్రతీ అంశాన్నీ పరిశీలిస్తున్నామని, ఏమైనా తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.