తెలంగాణ మార్చ్ కి పర్మిషన్ లేదు
posted on Sep 25, 2012 @ 6:09PM
తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వడం కుదరదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ కి తేల్చిచెప్పారు. జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సును, వినాయక నిమజ్జనాన్ని చూసుకోవాలిగనుక ఇలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని నగర పోలీస్ కమిషనర్ గట్టిగా చెప్పేయడంతో పొలిటికల్ జెఎసి నేతలు ఖంగుతిన్నారు. పోలీసుల అనుమతి దొరకడం కష్టమే అని ముందుగానే ఊహించిన కోదండరామ్ “సాగరహారం “ పేరుతో తెలంగాణ మార్చ్ ని జరిపేందుకు కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. తనిఖీల పేరుతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ నేతల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.