తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!

తెలంగాణ రాష్ట్ర లోక్‌సభ ఫలితాలలో కాంగ్రెస్, బీజీపీ మధ్య హోరాహోరీ పోరు వుండే అవకాశం వుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. రాష్ట్రంలో 17 స్థానాలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 9 స్థానాలు గెలుస్తాయని దాదాపు అన్ని సర్వే సంస్థలు  చెప్పాయి. మరోవైపు బీజేపీ కూడా ఈ స్థాయిలోనే స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. ఇక మొన్నటి వరకూ అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఈసారి సున్నా స్థానాలు లేదా చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఒక స్థానం గెలుచుకోవచ్చని సర్వేలు చెప్పాయి.

Teluguone gnews banner