కూటమికే జై కొట్టిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
posted on Jun 1, 2024 @ 7:19PM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఇక కూటమి భాగస్వామ్య పక్షాలలో జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది.
అంటే మొత్తంగా కూటమి 111 నుంచి 135 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక వైసీపీ 45 నుంచి 60 స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే తెలుగుదేశం కూటమికి 52 శాతం, వైసీపీకి 44 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ సర్వే పేర్కొంది.