తేల్చుకోవాలనుకుంటున్న తెలంగాణా మంత్రులు

ప్రత్యేకతెలంగాణారాష్ట్రం ఇస్తారా? లేదా? అని తేల్చుకోవాలని తెలంగాణాప్రాంతానికి చెందిన మంత్రులు నిశ్చయించుకున్నారు. తాము ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన తరువాత ఇక ఆగటం ఎందుకని ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్మంత్రులు చెప్పిన అన్ని అంశాలూ క్షుణ్నంగా పరిశీలించాక చివరాఖరున చూద్దామని ఓ చిరునవ్వు నవ్వారు. అలానే ఇతర నేతలు కూడా మంత్రులకు నవ్వుతూ వీడ్కోలు పలికారు. దీనికి కారణం ముందురోజు సిఎంతో సుదీర్ఘచర్చలు, తరువాత రోజు మంత్రులతో మంతనాలు వరుసగా జరగటమే. అయితే కాంగ్రెస్పార్టీ తెలంగాణాపై ఒక అభిప్రాయానికి రాలేకపోతోందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్అధిష్టానం కూడా దీని విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నా దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలెత్తే సమస్యలు పార్టీని నిశ్చితాభిప్రాయం వైపు రానీయటం లేదు. అయితే తాజాగా రాహుల్గాంధీ కూడా దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తున్నది. ఈ దశలోనే మంత్రులు ముఖేశ్‌, దానం నాగేందర్మినహా మిగిలిన తెలంగాణా మంత్రులందరూ జానారెడ్డి ఆధ్వర్యాన సోనియాకు లేఖ రాశారు. సోనియాగాంధీ ఆ లేఖను పరిశీలించే తెలంగాణా మంత్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశమిచ్చారు. అయితే తెలంగాణా ఇవ్వటం కష్టమని కాంగ్రెస్ సీనియర్నేతలు కే. కేశవరరావు, కోటమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లుగానే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్అధినేత చంద్రశేఖరరావు ఢిల్లీలో ఉండి లాబీయింగు చేసినా రాని స్పందన తెలంగాణా మంత్రులు సాధిస్తారా? లేక తేల్చుకోవాలని వెళ్లి సిఎం కిరణ్కుమార్రెడ్డి వెనుక నడవటానికి సిద్ధపడి వస్తారా? అన్న ఉత్కంఠ రాష్ట్రంలో పెరిగిపోతోంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.