మైనార్టీ కుంభకోణం డబ్బుతో టీవీ ఛానెల్ కొనేశారు

రాష్ట్ర మైనార్టీ శాఖ నిధులను సుమారు 55 కోట్ల రూపాయల మేర నిర్భయంగా స్వాహా చేసిన నిందితులు ఆ డబ్బుతో ఇంకా ప్రారంభంకాని తెలుగు టీవి న్యూస్ఛానల్ను కొనుగోలు చేసినట్లు తెలుగువన్డాట్కామ్పరిశోధనలో తేలింది. ఫోర్జరీ డాక్టుమెంట్లతో ఎ.పి. స్టేట్మేనార్టీస్కార్పోరేషన్లిమిటెడ్పేరిట  విజయ బ్యాంక్లో ఎక్కౌంట్లు ఓపెన్చేసి ప్రభుత్వం విడుదల చేసిన రూ. 80 కోట్లతో 55 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఖర్చు చేశారు. అయితే ఇలా చేసిన ఖర్చులో ఎనిమిది కోట్ల రూపాయలతో  విజయవాడ కేంద్రంగా ఇంకా ప్రారంభం కాని న్యూస్ఛానల్‌  కొనుగోలు చేయడం ఒక కోణమైతే ఆ ఛానల్కు చెందిన ఒక పార్టనర్‌  మరో పార్టనర్ను మోసగించి ఈ ఎనిమిది కోట్లలో ఐదు కోట్లు నొక్కేయడం మరో కోణం. ఈ ప్రధాన స్కామ్తో పాటు మినీ స్కాంలో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ( గతంలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి ) హైదరాబాద్కు చెందిన ఇద్దరు టి.వి. జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్వసనీయంగా తెలిసిందిఈ ముగ్గురిలో ఒకరిని ఇప్పటికే సి.బి.సి..డి. అధికారులు ప్రశ్నించగా విజయవాడ వాసి గుట్టు చప్పుడు కాకుండా అమెరికాలోని తమ కుమార్తె వద్దకు చెక్కేయడానికి టికెట్లు బుక్చేసుకున్నాడని అతను నేడో రేపో దేశ సరిహద్దులు దాటి పోతాడని తెలిసింది.

       విజయవాడ కేంద్రంగా ఒక న్యూస్ఛానల్ప్రారంభించి నూతనఅంకానికి నాంది పలకాలని   ఆ విజయవాడ మాజీ జర్నలిస్టు గత రెండేళ్ళుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతనికి  రియల్ఎస్టేట్తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తి ఒకరు అభయమివ్వడమే గాక సుమారు మూడు కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చాడు. నూతన అంకానికి తెరలేపాలనుకున్న వ్యక్తి మాత్రం తన వంతు పెట్టుబడిపై తత్సారం చేస్తూ ఛానల్ను  తేలేక చేతులెత్తేయడంతో అ్పపటికే అభయం ఇచ్చి నిధులు కూడా విడుదల చేసిన వ్యక్తి తన డబ్బు సంగతేంటని నిలదీయసాగాడు. ఈ నేపధ్యంలో మైనార్టీ స్కాంలో అప్పణంగా డబ్బు కొల్లగొట్టిన నిందితుల్ని  హైదరాబాద్కు చెందిన ఇద్దరు టి .వి. జర్నలిస్టులు నూతన అంకానికి తెరలేపాలనుకున్న విజయవాడ వాసికి పరిచయం చేయడం ఇతను ఇంకా తెరలేపని ఛానల్ను ఎనిమిది కోట్లకు విక్రయించడం జరిగిందిఈ ఎనిమిది కోట్లలో  కేవలం రూ.3.02 కోట్లను మాత్రమే   అభయ మిచ్చిన వ్యక్తికి ఇచ్చి మిగిలిన ఐదు కోట్లను ముగ్గురు స్వాహా చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సి.బి.సి..డి వీరు జరిపిన లావాదేవీలపై సమాచారం ఇవ్వవలసిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. ఈ శాఖ విచారణలో ఈ మినీ కుంభకోణం హైటపడిది.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.