జయలలిత అందుకే శశికళఫై వేటు వేశారా?
posted on Dec 20, 2011 @ 9:40AM
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై జయలలిత ఇష్టసఖి శశికళ కన్నేసిందట. ప్రస్తుతం అన్ని వ్యవహారాలను తానే ముందుండి చూసుకుంటున్న శశికళపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళపై వేటు పడటానికి కారణాలేంటో ఆరాతీస్తే జయమ్మకు అత్యంత సన్నహితంగా ఉంటోన్న శశికళ వ్యవహార శైలి పూర్తిగా మారిందని, ఐఏఏఎస్, ఐపీఎస్ అధికారులను తన అదుపాజ్ఞలోనే ఉంచుకుంటున్నారని తెలిసింది.అంతేకాకుండా ఆస్తుల కేసు ప్రస్తుతం బెంగళూరు కోర్టులో విచారణ జరుగుతుండగా, జయలలితకు శిక్ష పడితే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా శశికళ చెప్పుకోవడం జయమ్మ దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జయ శశికళాపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా వేటు వేసినట్లు తెలిసింది.